రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి...భరోసా కల్పించే 108 అంబులెన్స్‌లలో కూడా 307 కోట్ల రూపాయలు... సాక్షాత్తు ఎంపీ విజయసాయిరెడ్డే...తన అల్లుడికి కట్టబెట్టారని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. ఎవరి సొమ్ము ఎవరు అల్లుడికి కట్టబెడుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు.
సరస్వతీ పవర్ కోసం నీటి కేటాయింపులు, గనుల కేటాయింపుల లీజు 50 సంవత్సరాలు పొడిగించడం చూస్తుంటే ...ఎవరి ఆస్తులు ఎవరికి దారాదత్తం చేస్తున్నారో అర్థం కాని వైనంగా ఉందన్నారు. పీపీఈ కిట్లు, బ్లీచింగ్ పౌడర్‌లో కూడా అవినీతికి పాల్పడే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: 'ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు'