ప్రభుత్వ శాఖాధిపతులు.. సచివాలయానికి విధిగా హాజరుకావాలన్న సీఎస్ ఆదేశాలు.. వైపాకా పాలనకు అద్దం పడుతున్నాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు దుయ్యబట్టారు. ప్రజలు కలెక్టరేట్లలో ఇచ్చే అర్జీలకు సమాధానం చెప్పేవారు లేరని ఆయన మండిపడ్డారు. వ్యవస్థల నిర్వహణలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతలా దిగజారిపోలేదన్నారు.
శాఖాధిపతులతో, మంత్రులతో సంబంధం లేకుండా పాలనాపరమైన అన్ని వ్యవహారాలు ముఖ్యమంత్రి, సలహాదారులే చేసేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు, ఇతర సౌకర్యాలు అందకపోయునా.. ఉద్యోగ సంఘాల నేతలు మౌనాన్నే నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:
CS Meeting with IAS officers: మీరే రాకపోతే ఉద్యోగులెలా ఎలా వస్తారు: సీఎస్