MLC Ashokbabu about Employees: రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తరువాత నాశనమైన వ్యవస్థ.. విద్యా వ్యవస్థేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్కు ఉద్యోగుల నుంచి ఈసారి కచ్ఛితంగా రిటర్న్ గిప్ట్ ఉంటుందని అన్నారు. నేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ పేరుతో ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు తప్పుపడుతున్నారని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు.
విలీన ప్రతిపాదన వల్ల కొన్ని వందల పాఠశాలలు మూతపడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమం ముఖ్యమంత్రికి నచ్చలేదన్న అశోక్ బాబు..దాన్ని దృష్టిలో పెట్టుకునే టీచర్లను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి