ఎన్నికల కమిషనర్‌కు సహకరించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనేనంటూ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులను బహిరంగంగా బెదిరించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
హింసాయుతంగా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతూ.. రాత్రింబవళ్లు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్న అధికారులను అవమానించటం దుర్మార్గమన్నారు. ఒక మంత్రి ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై దాడికి పాల్పడుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు నోరు మెదపడంలేదని నిలదీశారు.
ఆలయ మర్యాదలు చేస్తే బదిలీ వేటా..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఆలయ మర్యాదలు చేశారనే అక్కసుతోనే తిరుపతి జేఈవో బసంత్ కుమార్‌పై బదిలీ వేటు వేశారని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయకర్త రవి నాయుడు మండిపడ్డారు. దేవస్థానానికి ఉన్నతాధికారి వస్తే స్వాగతం అనే సంప్రదాయం అనాదిగా వస్తోందన్నారు. అందుకనుగుణంగానే పద్మావతి అమ్మవారి గుడిలో రమేష్ కుమార్‌కు మర్యాదలు చేశారని.. కానీ కక్ష సాధింపులో భాగంగా జేఈవోపై ప్రభుత్వం బదిలీ వేటు వేయటం అహంకారానికి నిదర్శనమన్నారు.
ఇదీ చదవండి:
ఏపీలో రూ.40వేల కోట్లతో 3,787 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు: రైల్వే మంత్రి