ETV Bharat / city

HIGH COURT: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిల్​పై విచారణ 18కి వాయిదా - హైకోర్టు వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఆధాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (APSDC)కి మళ్లిస్తోందని హైకోర్టులో వేసిన పిల్​పై విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది.

HIGH COURT
HIGH COURT
author img

By

Published : Aug 10, 2021, 3:23 AM IST

పన్నుల రూపంలో వస్తున్న ప్రభుత్వ ఆదాయాన్ని.. కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (APSDC)కి మళ్లిస్తున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యాజ్యం అపరిష్కృతంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. వ్యాజ్యాన్ని త్వరగా పరిష్కరించాలని కోరారు. రిజాయిండర్‌కు మరికొంత సమయం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ కోరారు. ఇప్పటికే మూడు వారాలు సమయం ఇచ్చామన్న ధర్మాసనం.. చివరి అవకాశం ఇదేనంటూ స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.

పన్నుల రూపంలో వస్తున్న ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమచేయకుండా నేరుగా ఏపీఎస్​డీసీ (APSDC)కు మళ్లిస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ వేశారు. ఏపీఎస్​డీసీ చట్టంలోని సెక్షన్ 12 ( 1 ), ( 4 ), ( 5 ) ను రద్దు చేయాలని పిటిషన్​లో కోరారు. ఏపీఎస్​డీసీ తీసుకునే రూ. 25 వేల కోట్లు రుణానికి విశాఖలోని ప్రభుత్వ భూములు, భవనాలను తనఖా పెట్టేందుకు వీలు కల్పిస్తు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు.

ఇదీ చదవండి:

సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూముల వివాదంపై దర్యాప్తునకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.