రాజధాని పరిధిలోని తాడికొండ స్థానాన్ని వైకాపా దక్కించుకోవడం... తెదేపా తట్టుకోలేకపోతోందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి కొందరు తెదేపా నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. తాను పూజ చేస్తే... దేవుడు మైలపడతాడని చెబుతూ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తయారు చేసినవారు దళితులేనని గుర్తుంచుకోవాలన్నారు. రాజధానిలో అక్రమాలు వెలికి తీస్తున్న తనపై దాడి చేశారని... వారందరినీ చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. తనను దూషించిన వారినే కాకుండా... వారిని పెంచి పోషించిన చంద్రబాబును కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిలోని దళిత రైతులకు ఇచ్చే ప్యాకేజీలోనూ వివక్ష చూపారని ఆరోపించారు.
ఇదీ చదవండీ... 'చేత కాకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి'