విజయవాడ గ్రామీణం నున్న గ్రామ సమీపంలో ఈ నెల 8న పేదలకు పంచనున్న ఇళ్ల స్థలాలను నగర సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో 81 ఎకరాల భూమిలో 4,189 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
అవినీతికి తావు లేకుండా అర్హులైనవారికి ఇళ్ల స్ధలాలు ఇవ్వనున్నామని ఆయన వెల్లడించారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని ఓ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
ఇదీ చదవండి: