ప్రజా సమస్యలపై తెదేపా పోరాడటాన్ని జగన్ సహించలేక పోతున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మండిపడ్డారు. ఏడాది వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.... తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్టుల వెనుక జగన్ కక్ష సాధింపు చర్య ఉందన్నారు. దురుద్దేశ పూర్వకంగానే తెదేపా నేతలపై కక్షగట్టి శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అరెస్టులకు నిరసనగా తన నివాసంలో అచ్చెన్నాయుడు అరెస్టుకు కారణమైన ఎఫ్ఐఆర్ కాపీలను తగలబెట్టారు.
ఇవీ చదవండి: ఎర్రన్నపై కక్షతోనే.. అచ్చెన్నపై వైకాపా కుట్ర: చంద్రబాబు