ప్రజాసమస్యల మీద చర్చిస్తే ప్రభుత్వ అసమర్థత బయటపడుతుందన్న భయంతోనే.. వైకాపా ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగారని.. తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(mla anagani satyaprasad fires on ycp) దుయ్యబట్టారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం(speaker tammineni seetharam)కు.. అనగాని బహిరంగ లేఖ రాశారు.
ఈ నెల 19న.. శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన చర్చలు, వాదోపవాదాలు.. రాష్ట్ర ప్రజానీకం మొత్తం ప్రత్యక్షంగా వీక్షించారని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు పట్ల అధికార పార్టీ నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలను విస్తుపోయేలా చేసిందని మండిపడ్డారు. సభలో లేని, సభకు సంబంధంలేని భువనేశ్వరి(chandrababu wife)పై పాలకపక్ష సభ్యులు చేసిన నిందారోపణలు.. మహిళల మనోభావాలను కించపరిచినట్లయిందని ఆక్షేపించారు.
తెలుగు రాష్ట్రాల్లోని మహిళా లోకానికి చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రభుత్వం మాత్రం భువనేశ్వరి పట్ల ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయలేదని బుకాయిస్తోందని దుయ్యబట్టారు. ఈ నెల 19న శాసనసభలో జరిగిన చర్చలకు సంబంధించిన వీడియోలు.. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. సభాపతిగా.. పక్షపాతం లేకుండా ఆడియో, వీడియోలను ప్రజాక్షేత్రంలో ప్రవేశపెట్టి.. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి:
Floods in AP: ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కర్లేదు - సీఎం జగన్