Mirchi Farmers Protest : కృష్ణాజిల్లా నందిగామలో జాతీయ రహదారిపై రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. నకిలీ మిర్చి విత్తనాలు సాగుచేసి, తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహించిన కర్షకులు నందిగామ ఏడిఏ కార్యాలయాన్ని ముట్టడించారు.
పంట చేలోని మిర్చి మొక్కలను తీసుకువచ్చి కార్యాలయం ముందు వేసి ఆందోళన చేశారు. అనంతరం విజయవాడ - మార్కెట్ యార్డ్ వద్ద హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు వైఖరిపై రైతు సంఘం నాయకుసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. పోలీసులు అడ్డుకోవటం సరికాదన్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : Car Rush To Canal: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు