ETV Bharat / city

kodali Nani: భాజపాను తెదేపాకు అద్దెకిచ్చేసిన వీర్రాజు - కొడాలి నాని

Kodali nani on new Districts: ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరిగిందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భాజపాను తెదేపాకు బీ టీమ్‌గా సోము వీర్రాజు మార్చేశారని విమర్శించారు.

Kodali nani on new Districts
కొడాలి నాని
author img

By

Published : Jan 27, 2022, 8:01 PM IST

Updated : Jan 28, 2022, 7:42 AM IST

Kodali nani on new Districts: రాష్ట్రంలో భాజపాను తెదేపాకు బీ టీమ్‌గా సోము వీర్రాజు మార్చేశారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు ఎజెండా తయారుచేస్తే వీర్రాజు దాన్ని అమలు చేస్తారని ఆరోపించారు. ‘సోము వీర్రాజు భాజపాను తెదేపాకు అద్దెకిచ్చారు. ఎవరైనా మంచోడు దొరికితే ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి మార్చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు.

‘రైతుల కోసం 11 వేలకు పైగా ఆర్బీకేలను తెచ్చి.. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు వ్యవస్థలతో ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ చేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. పాదయాత్ర సమయంలో నిమ్మకూరు ప్రాంతంలో ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు జగన్‌ను కలిసి మేం మీకు మద్దతిస్తాం.. ఎన్టీఆర్‌ పేరును జిల్లాకు పెట్టాలని కోరారు. జగన్‌ వారికి మాటిచ్చినట్లుగానే.. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెట్టారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎన్టీఆర్‌ను దైవంగా భావించే వారి తరఫున నేను ముఖ్యమంత్రి జగన్‌కు పాదాభివందనం చేస్తున్నా’ అని చెప్పారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 28, 2022, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.