విజయవాడలోని భారతీనగర్‌లో ఓ మైనర్ తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. మాచవరంలోని ఎస్‌ఆర్‌ఎస్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో... నాలుగు రోజుల క్రితం విజయవాడ రామలింగేశ్వర్‌నగర్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కళాశాలలు పునఃప్రారంభం కావడంతో... గురువారం ఉదయం 7 గంటలకు అమ్మమ్మ ఇంటి నుంచి భారతీనగర్‌కు కాలినడకన బయలుదేరింది. కానీ ఇంటికి రాలేదు. 9 గంటలు దాటినా బాలిక ఇంటికి చేరకపోవడంతో... తన తల్లిలో ఆందోళన మొదలైంది. తెలిసిన వాళ్ల దగ్గర వాకబు చేసినా ఆచూకీ లేదు. పడమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బిడ్డను కిడ్నాప్ చేసి ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. సీసీ కెమెరాల సాయంతో కేసు మిస్టరీని చేధిస్తామని పోలీసులు బాలిక తల్లికి భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండీ... అలిపిరిలో ఉద్రిక్తత... తమిళ తంబిలపై భద్రతా సిబ్బంది దాడి