Vidadala Rajani: విజయవాడ జీజీహెచ్ లో జరిగిన ఘటనపై శాఖాపరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని.. వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని డీఎంఈని ఆదేశించారు. ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించారు. వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తూ.. వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జీజీహెచ్ లో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసులిచ్చారు. సీఎస్ ఆర్‌ఎంఓకి ఇప్పటికే అధికారులు షోకాజ్ నోటీసు జారీచేయగా.. నివేదిక అందిన వెంటనే మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి విడదల రజని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
విజయవాడ ప్రభుత్వాస్పత్రి దగ్గర ప్రజాసంఘాల ఆందోళన.. ఉద్రిక్తత