విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసిందని బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్, డైరక్టర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హాజరైన మంత్రి... ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు చేయూత నిచ్చేందుకు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసం సీఎం జగన్ పాటు పడుతున్నారన్నారు. నూతన కార్పోరేషన్లతో అట్టడుగున ఉన్న కులాలకు సైతం ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లపంల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: