ETV Bharat / city

ఎస్​ఈసీ... ప్రభుత్వాన్ని శాసిస్తామంటే కుదరదు: మంత్రి వెల్లంపల్లి - ఏపీ స్థానిక ఎన్నికలు వార్తలు

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నంత మాత్రాన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వాన్ని శాసిస్తామంటే కుదరదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు ఎస్​ఈసీ చేస్తామంటే ప్రభుత్వం సహకరించదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న వ్యక్తి... పార్టీలు, మతాలకు అతీతంగా పనిచేయాలన్నారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి కోర్టుల్లో లాయర్లను ఏ విధంగా పెట్టుకుంటున్నారని వెల్లంపల్లి ప్రశ్నించారు.

Minister vellampalli srinivas
Minister vellampalli srinivas
author img

By

Published : Nov 19, 2020, 7:11 PM IST

ఎస్​ఈసీ...ప్రభుత్వాన్ని శాసిస్తామంటే కుదరదు : మంత్రి వెల్లంపల్లి

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నంత మాత్రాన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రభుత్వాన్ని శాసిస్తామంటే కుదరదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎస్​ఈసీ వ్యవహారంపై ఆవేదనతో మంత్రులు నిజాలు మాట్లాడుతుంటే అతనికి బాధ అనిపిస్తోందని విజయవాడలో అన్నారు. ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న వ్యక్తి... పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా పనిచేయాలన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో రూ.కోట్లు ఖర్చు పెట్టి నిమ్మగడ్డ ఏ విధంగా లాయర్లను పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయవాదులను పెట్టుకోలేకపోతోందని అన్నారు.

"గతంలో ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారు? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తామంటే ప్రభుత్వం సహకరించబోదు. మా ప్రభుత్వం ప్రజల తరపున మాట్లాడుతుంది."

--వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయశాఖ మంత్రి

ఇదీ చదవండి : స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్ చర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.