గత ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలోని 49, 56వ డివిజన్లలో రూ. 1.75 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
వైకాపా ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. కేశినేని నాని, బొండా ఉమాలు 5 నెలలకు ఒకసారి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కనకదుర్గ పై వంతెన వారి హయాంలో నిర్మాణమై ఉంటే.. అప్పుడే ప్రారంభం చేయాలి కదా అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పై వంతెన నిర్మాణం పూర్తి చేశామని.. సెప్టెంబరు 4న వంతెన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కరోనా సమయంలో పేద ప్రజల కోసం పని చేయాల్సిన చంద్రబాబు హైదరాబాద్లో జూమ్ సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు. కొవిడ్ సమయంలోనూ సీఎం జగన్ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పని చేస్తున్నారని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి..