ETV Bharat / city

'ఉద్యోగుల సమస్యలను సీఎం స్వయంగా పరిష్కరిస్తున్నారు'

ఏపీ ఎన్జీవో కార్యాలయానికి స్థలం ఇచ్చిన తంగిరాల వీర రాఘవయ్య విగ్రహావిష్కరణ విజయవాడలో జరిగింది. మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులకు ఎటువంటి సమస్యలున్నా సీఎం జగన్ స్వయంగా పరిష్కరిస్తున్నారని తెలిపారు.

apngo office vijayawada, minister vellampalli mla malladi in vijayawada apngo office
విజయవాడలో ఏపీ ఎన్జీవో కార్యాలయం, ఏపీ ఎన్జీవో కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు
author img

By

Published : Apr 7, 2021, 3:28 PM IST

విజయవాడలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ వెస్ట్ కృష్ణా బ్రాంచ్​లో తంగిరాల వీర రాఘవయ్య విగ్రహాన్ని.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవిష్కరించారు. సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. ఏపీ ఎన్జీవో కార్యాలయనికి స్థలం ఇచ్చిన వీర రాఘవయ్యను గుర్తుచేసుకుని.. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని చెప్పారు.

రాష్ట్రంలోని ఉద్యోగులను స్నేహపూర్వకంగా పలకరించేది సీఎం జగన్ మాత్రమేనని మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది అన్నారు. ఉద్యోగులకు ఎటువంటి సమస్యలున్నా ఆయనే స్వయంగా పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీతో పాటు అన్ని ప్రయోజనాలను సీఎం అమలుచేస్తారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ.. కాసేపట్లో తీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.