ఇకపై ఇంటర్ ప్రైవేట్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్‌కు పరిమిత సంఖ్యలో విద్యార్థులకు అనుమతించనున్నారు. విద్యా సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేశామన్నారు. సెక్షన్‌కు 40 మందిని మాత్రమే చేర్చుకునేలా పరిమితులు కల్పించినట్లు వెల్లడించారు. రెండేళ్లకు కలిపి 720 మందిని మాత్రమే.. చేర్చుకునేలా... పరిమితులు ఉండనున్నాయన్నారు. గతంలో గరిష్ఠంగా ఉన్న 1584 మంది సంఖ్యను కుదించినట్లు మంత్రి సురేశ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తితిదే ఆస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించం: వైవీ సుబ్బారెడ్డి