రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన సంస్థలు దారితప్పితే చట్టసవరణలు చేయాల్సి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గాయపడిన ఓ రాజకీయ వ్యక్తిని పరామర్శించేందుకు ఎస్ఈసీ వెళ్లటం దేనికి సంకేతమని మంత్రి ప్రశ్నించారు.
అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి భయపెట్టి పనులు చేయించుకుంటున్నారని మంత్రి విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం మేర స్థానాలు వైకాపా కైవసం చేసుకుంటుందన్నారు. ఎస్ఈసీ స్థానిక సంస్థల ఎన్నికలను ఓ పెద్ద సంచలనంగా మార్చేశారని మంత్రి సురేశ్ ఆక్షేపించారు.
ఇదీచదవండి: మంత్రుల సమక్షంలో రసాభాస.. బైరెడ్డి వర్సెస్ ఆర్థర్