రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(minister suresh) దంపతులకు సుప్రీంకోర్టు(supreme court)లో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో.. సీబీఐ(CBI) విచారణ కొనసాగించాలని ఆదేశించింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ మేరకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక విచారణ చేపట్టాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐకి అనుమతిచ్చింది.
సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది.