వినియోగించిన విద్యుత్కే బిల్లులు వసూలు చేయనున్నట్లు మంత్రి సుచరిత తెలిపారు. పూర్తి పారదర్శంగా బిల్లుల వసూలు ఉంటుందని స్పష్టం చేశారు. వినియోగదారుల్లో అపోహలు తొలగించేందుకు విద్యుత్ శాఖ అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. బిల్లులో అనుమానాలుంటే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు. 500 దాటిన యూనిట్లపై స్వల్ప పెరుగుదల ఉందని.. ఇలాంటి వినియోగదారులు 5 శాతం మందే ఉన్నారని మంత్రి వివరించారు.
ఇదీ చదవండి: 'అసత్య ప్రచారాలు నమ్మొద్దు.. అనుమానాలు వద్దు'