ETV Bharat / city

పీహెచ్‌సీల్లో నెలకు కనీసం 10 కాన్పులు చేయాలి: మంత్రి రజని - మంత్రి రజని న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ పీహెచ్​సీలోనూ కనీసం నెలకు 10 కాన్పులు జరిగేలా ప్రయత్నించాలని వైద్యాధికారులను మంత్రి విడదల రజని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో నాణ్యమైన సేవల కోసం అధికారులు సహకరించాలన్నారు.

పీహెచ్‌సీల్లో నెలకు కనీసం 10 కాన్పులు చేయాలి

author img

By

Published : Jun 2, 2022, 8:53 PM IST

గ్రామస్థాయి నుంచి వైద్య కళాశాలల వరకూ ఆస్పత్రుల నిర్మాణం, ఆధునీకరణ వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు నాణ్యంగా అందాలంటే వైద్యులు, అధికారుల సహకారం కావాలని ఆమె స్పష్టం చేశారు. ఏపీఐఐసీ కార్యాలయం నుంచి వైద్యారోగ్యశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖలో అధికారులు కొంచెం దృష్టిసారిస్తే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మారతాయన్నారు. మంచినీటి కొరత, అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు, టాయిలెట్లు సరిగా లేకపోవటం లాంటివి తాను గమనిస్తున్నానని చెప్పారు. కేవలం నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలు పెద్దవిగా కనిపిస్తున్నాయన్నారు.

మరోవైపు 2021-22 జాతీయ హెల్త్ మిషన్ లక్ష్యాలను ఎంతవరకూ చేరుకున్నామనే అంశంపై చర్చించుకోవాల్సి ఉందన్నారు. ఎన్​హెచ్ఎం నిధులు సక్రమంగా వినియోగించుకోవటం లేదని మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా నిధులు మురిగిపోతున్నాయని ఏ ఆస్పత్రిలోనూ ఈ పరిస్థితి రాకూడదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ పీహెచ్​సీలోనూ కనీసం నెలకు 10 కాన్పులు జరిగేలా ప్రయత్నించాలని ఆదేశించారు. పీహెచ్​సీలు, సీహెచ్​సీలు కాన్పులు చేయకపోవటం వల్లే బోధనాసుపత్రులు జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. మరోవైపు ఏపీఏంఎస్ఐడీసీ ద్వారా కొనుగోలు చేసే పరికరాల నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.