ETV Bharat / city

Vemula Prashanth reddy: 'చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌ పని చేస్తున్నారు'

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇంద్రవెల్లి సభపై ఆ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. నోటి తీటను తీర్చుకునేందుకు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి ఇప్పటికీ పని చేస్తున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.

Vemula Prashanth reddy
'చంద్రబాబు డైరెక్షన్‌లోనే టీపీసీసీ రేవంత్‌ పని చేస్తున్నారు'
author img

By

Published : Aug 10, 2021, 7:29 PM IST

Updated : Aug 10, 2021, 9:30 PM IST

చంద్రబాబు (Chandrababau) డైరెక్షన్‌లోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Pcc Chief Revanth Reddy) పని చేస్తున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (Minister Prashanth Reddy) ఆరోపించారు. వందలమంది యువకుల చావుకు సోనియాగాంధీ (Sonia Gandhi) కారణమని ఆయన దుయ్యబట్టారు. 2004లోనే తెలంగాణ ఇస్తామని తెరాస (TRS)తో కాంగ్రెస్‌ (Congress) పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. 2004లో ఇస్తామన్న తెలంగాణ... 2014లో ఇచ్చారని తెలిపారు.

సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి కూడా వెనక్కి తగ్గారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆలస్యం చేసిన పదేళ్లలో ఎంతోమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. సోనియాగాంధీ దెయ్యం అని రేవంత్‌రెడ్డి ఎన్నోసార్లు విమర్శించారని పేర్కొన్నారు.

పూటకో మాట, పార్టీ మార్చే వ్యక్తి రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ 60 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లల్లో ఎస్సీ నేతను ప్రధానిగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోనూ దళిత ముఖ్యమంత్రిని ఐదేళ్లు పదవిలో ఉంచలేదన్నారు.

'చంద్రబాబు డైరెక్షన్‌లోనే పీసీసీ చీఫ్​ రేవంత్‌ పని చేస్తున్నారు'

రేవంత్​రెడ్డి... ఇంద్రవెల్లి సభలో నోటితీటను తీర్చుకున్నడు తప్పితే ఆ సభ ద్వారా దళిత, గిరిజనులకు గానీ ఆదివాసీలకు గానీ ఒరిగిందేమీ లేదు. కేసీఆర్​ను తిట్టి శునకానందం పొంది సభను ముగించారు. రేవంత్​రెడ్డి చరిత్రను మర్చిపోయి చాలాచాలా మాటలు మాట్లాడారు. 1981లో వందలమంది గిరిజనులను పిట్టల్ని కాల్చి చంపినట్టు చంపింది వీళ్ల కాంగ్రెస్ పార్టీనే. అప్పుడు వందలమందిని చంపింది కాంగ్రెస్ పార్టీయే... ఇప్పుడు అదే గిరిజనుల కోసం స్మారకచిహ్నం కడతమని నిన్న సభలో రేవంత్ చెప్పిండు. చంపినోళ్లే ఇవాళ స్మారక చిహ్నం కడతరట! ఇంతకన్న దుర్మార్గం ఇంకొటి లేదు. పీసీసీ చీఫ్​గా ఉంటూ... ఆంధ్ర నాయకుడు చంద్రబాబు నాయుడి మోచేయి నీళ్లు తాగుతూ ఆయన డైరెక్షన్​లో పనిచేస్తున్న రేవంత్​రెడ్డిని నమ్మాలా? రోజుకో పార్టీ.. పూటకో మాట మాట్లాడే రేవంత్​రెడ్డిని నమ్మాలా? ఏ రేవంత్​రెడ్డిని నమ్మాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్ణయించుకోవాలి. సోనియమ్మ రాజ్యం వస్తది అన్నరు. ఏ సోనియమ్మ రాజ్యం కావాలి? వందలమంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారణమైన సోనియమ్మ రాజ్యం మళ్లీ వస్తదా?

- ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి

ఇవీ చూడండి: Netanna Nestam: వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం నిధులు విడుదల

Last Updated : Aug 10, 2021, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.