రాష్ట్రంలో హెరాయిన్ విచ్చలవిడిగా సరఫరా అవుతుందని చంద్రబాబు(chandrababu) తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని(perni nani) అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దని కోరారు. సీఎంపై కోపం ఉంటే ఆయనకే పరిమితం చేయాలని, రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై కడుపుమంట చూపించవద్దని విజ్జప్తి చేశారు.
చెన్నైలో ఉండే వ్యక్తి బెజవాడలో హెరాయిన్ వ్యాపారం చేసేందుకు వస్తూ పట్టబడ్డారని కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయని, బెజవాడకు హెరాయిన్‌తో సంబంధం లేదని విజయవాడ పోలీసు కమిషనర్ స్పష్టంగా చెప్పారని మంత్రి తెలిపారు. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లకు వీరికి తేడా లేదని.. ఆంధ్రా తాలిబన్లుగా మారారని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా మారడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలపై ద్వేషాన్ని చూపవద్దని కోరారు..
ఇదీ చదవండి