ETV Bharat / city

రికార్డు స్థాయిలో ఉపాధి హమీ పనులు కల్పించాం: మంత్రి పెద్దిరెడ్డి

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న పథకాలపై సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కోట్లాది మందికి ఉపాధి హామీ పని కల్పించామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 25.25 కోట్ల పనిదినాలను ఉపాధి హామీ కింద రాష్ట్రానికి కేటాయించగా..ఇప్పటి వరకు 23.67 కోట్ల పనిదినాలను పేదలకు కల్పించినట్లు తెలిపారు.

రికార్డు స్థాయిలో ఉపాధి హమీ పని కల్పించాం

author img

By

Published : Mar 5, 2021, 9:22 PM IST

ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కోట్లాది మందికి ఉపాధి హామీ పని కల్పించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న పథకాలపై సచివాలయంలో మంత్రి రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, వైయస్‌ఆర్ జలకళ, పీఎంజీఎస్‌వై, జల్‌ జీవన్ కార్యక్రమాల అమలును సమీక్షించారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 25.25 కోట్ల పనిదినాలను ఉపాధి హామీ కింద రాష్ట్రానికి కేటాయించగా..ఇప్పటి వరకు 23.67 కోట్ల పనిదినాలను పేదలకు కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి మిగిలిన పనిదినాలను కూడా పూర్తి చేస్తామన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున పని చేయలేదని..,రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు అన్నారు. వేతన పనిదినాలకు సుమారుగా 5,0423 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఈ నెలాఖరు నాటికి మొత్తం ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.

గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ, వెల్‌నెస్ సెంటర్లు, ఆర్బీకేలు తదితర భవనాల కోసం 20 శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద మొత్తం నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో ఇప్పటి వరకు రూ. 3,086 కోట్లు ఖర్చు చేశామన్నారు. పీఎంజీఎస్‌వై కింద రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్థశ కల్పిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 3,185 కిలోమీటర్ల మేర పీఎంజీఎస్‌వై కింద రహదారులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని అందించబోతున్నామన్నారు. ఈ ఏడాది మొత్తం 19 లక్షల 21 వేల 50 ఇళ్లకు కుళాయిలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పేద, చిన్నా, సన్నకారు రైతులను ఆదుకునేందుకు నిర్ధేశించిన వైయస్‌ఆర్‌ జలకళ పథకం కోసం మూడేళ్ళలో మొత్తం 4 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ సహా అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాల బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్​కిన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.