ETV Bharat / city

Minister Peddireddy: 'జీవో నెంబరు 2 పై న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తాం' - minister peddireddy ramachandrareddy on go.2

ప్రభుత్వం ఇచ్చిన సవరణ జీవో నెంబరు 2 పై న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

minister peddireddy ramachandrareddy on GO 2 issued by high court
'జీవో నెంబరు 2 పై న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తాం'
author img

By

Published : Jul 12, 2021, 8:04 PM IST

Updated : Jul 12, 2021, 8:09 PM IST

'జీవో నెంబరు 2 పై న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తాం'

సర్పంచులు, కార్యదర్శుల అధికారాలను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన సవరణ జీవో నెంబరు 2 పై న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై సర్పంచులు.. ప్రభుత్వం వద్దకు వచ్చారని మంత్రి వివరించారు. ఈ విషయమై కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని మంత్రి తెలిపారు.

మరోవైపు... ప్రతిపక్షాలు లేటరైట్ ఖనిజానికి, బాక్సైట్​కు తేడా తెలీకుండా ప్రవర్తిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆదీవాసీల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే.. తెదేపా నేతలు ఈ ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తెదేపా ప్రభుత్వం ఇచ్చిన అనుమతినే పునరుద్ధరించామని స్పష్టం చేశారు. అక్కడ ఏ ఖనిజం ఉందని.. గత ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందో చెప్పాలని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

Rayalaseema Lift: తెలుగుదేశం కాదు.. తెలంగాణ దేశం పార్టీ: మంత్రి అనిల్

Last Updated : Jul 12, 2021, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.