ETV Bharat / city

ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ

(ఏపీ రూరల్‌ ఇంక్యూలెన్స్‌ గ్రోత్‌ ప్రాజెక్ట్) ఏపీఆర్‌ఐజీపీ పథకాన్ని మరో అయిదేళ్లపాటు రాష్ట్రంలో కొనసాగించేందుకు ప్రపంచబ్యాంక్​ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో విజయవాడలో భేటీ అయ్యారు.

ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ
ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ
author img

By

Published : Feb 6, 2020, 10:33 AM IST

విజయవాడలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్​) ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం కింద చేస్తున్న పనులపై సెర్ప్​ సీఈవో రాజాబాబు ఇచ్చిన నివేదిక పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఆర్‌ఐజీపీ పథకాన్ని మరో అయిదేళ్లపాటు రాష్ట్రంలో కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న 168 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఆఫీస్, ఇన్ పుట్ షాప్​లను ఏర్పాటు చేసి, వైఎస్సార్​ రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలపై సమీక్షించారు. నేషనల్ లెవెల్ ఎస్​పీవో వర్క్ షాప్​లను ఏర్పాటు చేసి ఈ ప్రగతిని దేశ వ్యాప్తంగా తెలియజేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.

ఇదీ చూడండి: మంత్రి మేకపాటితో ఫ్రెంచి ప్రతినిధులు భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.