ETV Bharat / city

Narayana swamy: 'ప్రజల హృదయాల్లో జగన్​కు ప్రత్యేక స్థానం ఉంది'

హోంమంత్రి సుచరితను కించపరిచేలా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో సమాజమే సిగ్గుతో తలదించుకుందని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ వైఎస్ కుమారుడే కానీ..వారసుడు కాదన్నారు. పాదయాత్ర ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని పేదల హృదయాలను గెలుచుకున్నారన్నారు.

సీఎం జగన్ వైఎస్ కుమారుడే కానీ..వారసుడు కాదు

author img

By

Published : Sep 21, 2021, 6:47 PM IST

'సీఎం జగన్ వైఎస్ కుమారుడే కానీ..వారసుడు కాదు'

హోంమంత్రి సుచరితను కించపరిచేలా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో సమాజమే సిగ్గుతో తలదించుకుందని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడుది ఉగ్రవాద మనస్తత్వమంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్సీ, బీసీల మధ్య ఘర్షణ సృష్టించేలా అయ్యన్న వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తమిళనాడులో జయలలిత స్థానిక ఎన్నికలను బహిష్కరించినప్పుడు అసలు పోటీనే చేయలేదని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసి..,పోటీ చేసిన తెదేపా ఇప్పుడు బహిష్కరించామని అంటున్నారని ఎద్దేవా చేశారు. అందర్నీ రాజీనామా చేయమని కోరే బదులు కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. ఓ సామాన్య మహిళా కార్యకర్తను నిలబెట్టి చంద్రబాబును ఓడిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ వైఎస్ కుమారుడే కానీ..వారసుడు కాదన్నారు. పాదయాత్ర ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని పేదల హృదయాలను గెలుచుకున్నారని నారాయణ స్వామి అన్నారు.

''అయ్యన్న మాటలు సమాజమే తలదించుకునేలా ఉన్నాయి. ఆయనది ఉగ్రవాద మనస్తత్వం. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యన్నపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. జగన్​మెహన్ రెడ్డి వైఎస్ కుమారుడే కానీ..వారసుడు కాదు. ప్రజల హృదయాల్లో ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు'' -నారాయణ స్వామి, ఉపముఖ్యమంత్రి

ఇదీ చదవండి

MP Bharat : చీకటి రాజకీయాలు ఎవరివో అందరికీ తెలుసు: ఎంపీ భరత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.