కరోనా ప్రభావం వల్ల వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు అధికారులు శ్రమిస్తున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా కనీస ధర నిర్ణయించామన్న ఆయన.. వివిధ విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ కోసం కొంత వెసులు బాటు కల్పించామన్నారు. రహదారులు భవనాల శాఖ కార్యాలయంలో పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆక్వా, ఫిషరీస్ రంగాల్లో నష్టాలపై మరో రెండు రోజుల్లో నివేదికను కేంద్రానికి పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుని అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: