సినిమా టికెట్ల ధరలు అమాంతంగా పెంచేసి కొందరు నిర్మాతలు చేస్తున్న దోపిడీని కట్టడి చేసేందుకే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కొడాలి నాని(minister kodali nani) స్పష్టం చేశారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ తనయుడు హరికృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘‘ఆటో రజినీ’’ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయిన కొడాలి.. మీడియాతో మాట్లాడారు.
‘‘చిన్న సినిమాలను బతికించేందుకు మార్పు అనివార్యమైంది. సినీ పరిశ్రమ అంటే నలుగురు నిర్మాతలు మాత్రమే కాదు. ఒకరు బెదిరిస్తే ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో బెదిరిపోయే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి.. ఎక్కడ ఏ విధమైన రేట్లు ఉండాలనే విధానంపై నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారమే సినిమా టికెట్లు అమ్మాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హైకోర్టు సైతం తెలిపింది. కేవలం ఒక వ్యక్తి లేదా ఒక సినిమాను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్(kodali nani on pawan comments) అరిచినంత మాత్రాన అదిరిపోయి, బెదిరిపోయి పారిపోయేది కాదు రాష్ట్ర ప్రభుత్వం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎవరి మద్దతు అవసరం లేదు. ఆయనకు భగవంతుడి మద్దతు ఉంది’’ అని కొడాలి నాని అన్నారు.
ఇదీ చదవండి:
MOUNTAIN CLIMBING: ఎనిమిదేళ్ల వయసులోనే ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన బుడతడు