గుడివాడలో తాను పేకాట ఆడిస్తున్నానని చంద్రబాబు ఆరోపించటంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే..మర్యాదగా ఉండదని హెచ్చరించారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అమరావతిలో చంద్రబాబు, ఆయన బినామీలు వేల కోట్లు దోచుకు తిన్నారని ఆక్షేపించారు.
లక్ష కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించటాన్ని మంత్రి కొడాలి తప్పుబట్టారు. ప్రజల సంక్షేమ పథకాల కోసం రూ.90 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. తెదేపా హయాంలో 3 లక్షల 60 వేల కోట్లు అప్పులు తెచ్చి ఎవరికీ ఇవ్వకుండా దోచుకుని తిన్నారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై మోదీని ప్రశ్నించాలన్నారు.
ఇదీచదవండి