ETV Bharat / city

'పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది'

కరోనా కారణంగా పది, ఇంటర్ తరగతి పరీక్షలు నిర్వహించకపోవటం వల్ల పిల్లలు నష్టపోతున్నారని..,పరీక్షలు నిర్వహించటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో కరోనా మరణాలు విపరీతంగా పెరిగాయని..,జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

MINISTER KANNABABU ON EXAMS IN AP
పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది
author img

By

Published : Apr 22, 2021, 11:02 PM IST

రాష్ట్రంలో కరోనా మరణాలు విపరీతంగా పెరిగాయని..,జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. కొవిడ్​తో మృతి చెందితే గుండెపోటుగా నివేదికలు ఇస్తున్నారని చెప్పటంలో వాస్తవం లేదన్నారు. ప్రతి రోజూ ప్రభుత్వం పరీక్షలు, నివేదికలను పారదర్శకంగా వెల్లడిస్తుందన్నారు. కరోనాపై సీఎం జగన్ రేపు సమీక్షిస్తారని..,కరోనా కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు.

పది, ఇంటర్ తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలు నష్టపోతున్నారని..,పరీక్షలు నిర్వహించటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందన్నారు. పరీక్షల నిర్వహణ కష్టమని భావిస్తే..ప్రభుత్వం పరీక్షలపై సామాజిక బాధ్యతతో నిర్ణయాన్ని వెల్లడిస్తుందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి దోచుకోవటాన్ని ప్రైవేటు ఆస్పత్రులు వెంటనే ఆపాలని, ఇలాంటి చర్యలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచదవండి

మిర్చి, మామిడి ధరలు పడిపోలేదు: మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.