తెదేపాపై మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమపై కావాలని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ వంద కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని కన్నబాబు వివరించారు.
మా పాలనను నిందించే హక్కు తెదేపాకు లేదు. గ్రామసచివాలయాలు, లక్షలమందికి ఉద్యోగాలు కనిపించటం లేదా?. అవినీతి ఉండకూడదని కాల్‌సెంటర్ పెట్టిన ఘనత మాది. తెదేపా అవినీతి, అక్రమాలను త్వరలోనే బయటపెడతాం.
-మంత్రి కన్నబాబు
ఇదీ చదవండి:మనబడి కార్యక్రమం... విధివిధానాలు ఇవే..!