వ్యవసాయ ఉత్పత్తులతో పాటు... త్వరగా చెడిపోయే ఉత్పత్తులను సకాలంలో వినియోగం చేయడంపై శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం సూచించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మిర్చి మార్కెట్ యార్డును మరి కొంత కాలం మూసివేయాలని నిర్ణయించిట్లు చెప్పారు. కొనుగోలు వికేంద్రీకరణ చేసి మిర్చిని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అనకాపల్లి బెల్లం మార్కెట్‌పైనా దృష్టి పెట్టామన్నారు. నూనెలు ఎక్కువ ధరకు విక్రయించిన వ్యాపారులపై చర్యలుంటాయని... రేషన్ సరకుల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి కన్నబాబు వివరించారు.
ఇవీ చూడండి: