ETV Bharat / city

రిజర్వేషన్లపై తెదేపానే కోర్టుకెళ్లింది: కన్నబాబు

బీసీలకు న్యాయం జరగకుండా రిజర్వేషన్ల ప్రక్రియపై తెదేపానే కోర్టుకు వెళ్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో వ్యాజ్యం నడుస్తుంటే తెదేపా ఎందుకు జోక్యం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

author img

By

Published : Mar 2, 2020, 11:42 PM IST

రిజర్వేషన్లపై తెదేపానే కోర్టుకెళ్లింది: కన్నబాబు
రిజర్వేషన్లపై తెదేపానే కోర్టుకెళ్లింది: కన్నబాబు
రిజర్వేషన్ల అంశంలో తెదేపాపై విమర్శలు చేస్తోన్న మంత్రి కన్నబాబు

స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశంపై తెదేపా లేనిపోని బురద జల్లుతోందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తెదేపాకు చెందిన వ్యక్తే కోర్టులో రిజర్వేషన్లపై వ్యాజ్యం వేశారని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో పింఛన్ల పంపిణీ ఓ రికార్డని మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ పింఛన్లు ఇచ్చినా.. కోతలు విధించినట్టుగా తెదేపా ఆరోపణలు గుప్పించటం సరికాదన్నారు. చంద్రబాబు, వైఎస్సార్​కు పోలికే లేదని మంత్రి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి ఆస్తుల వ్యవహారం, కృత్రిమ ఉద్యమాలు మినహా మరేమీ పట్టవని కన్నబాబు ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

రిజర్వేషన్లపై కోర్టు తీర్పును గౌరవిస్తాం: బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.