ETV Bharat / city

కాంగ్రెస్​, భాజపాలది చీకటి ఒప్పందం: మంత్రి జగదీశ్​రెడ్డి - తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వార్తలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఉగ్రవాది, దేశద్రోహి అన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. భాజపా నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్​, భాజపాలది చీకటి ఒప్పందమని ఆరోపించారు. జీహెచ్​ఎంసీలో వంద సీట్లకు పైనే గెలిచి మేయర్​ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

jagadeesh reddy  comments on bjp and congress
కాంగ్రెస్​, భాజపాలది చీకటి ఒప్పందం: మంత్రి జగదీశ్​రెడ్డి
author img

By

Published : Nov 20, 2020, 6:23 PM IST

భాజపా నేతలు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో తమకు ఏ పార్టీతో పొత్తు లేదని... పొత్తు తెలంగాణ ప్రజలతోనేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, భాజపాలది చీకటి ఒప్పందమని.. తెరాసకు వ్యతిరేకంగా ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్​ భాజపాకు సహకరిస్తోందని ఆరోపించారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, దుబ్బాకలో ఒకరికొకరు సహకరించుకున్నారని పేర్కొన్నారు. వరదలపై కూడా ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరద సహాయం నిలిపేయాలని భాజపా, కాంగ్రెస్‌ రెండు పార్టీలు లేఖలు రాశాయని... ఇప్పుడు తాము రాయలేదని డ్రామాలాడుతున్నారని అన్నారు. రెండు పార్టీలకు ప్రజలపై ప్రేముంటే వరద సహాయం అందించాలని మరోమారు లేఖ రాయాలన్నారు. కేసీఆర్‌ను ఉగ్రవాది, దేశద్రోహి అన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

గుజరాత్‌, యూపీలో చలానాలు భాజపా ప్రభుత్వాలే కడుతున్నాయా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి చలానాలు వేస్తారని... ఆ తప్పు చేసిన వారికి భాజపా అండగా ఉంటుందా అని నిలదీశారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అసదుద్దీన్​తో మోదీ ఎందుకు సమావేశమయ్యారో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. దేవుళ్ల పేరుతో ఓట్లు అడుక్కోవడం భాజపాకు అలవాటుగా మారిందన్నారు. జీహెచ్‌ఎంసీలో వంద సీట్లకు పైనే గెలిచి.. సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామన్నారు. కేసీఆర్ హైదరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నారని... బండి సంజయ్ తన లేఖ ఫోర్జరీ అయితే పీఎస్​కు వెళ్లాలి కాని.. గుడికి కాదన్నారు. అప్రమత్తంగా లేకపోవడం వల్లే దుబ్బాకలో ఓడిపోయామన్నారు.

కేసీఆర్​ను ఉగ్రవాది, దేశద్రోహి అన్నవారిపై కచ్చితంగా న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ మాట అన్న నాయకుడిని ఓ మాట అడుగుతున్నా... మీరు ఏ పార్టీ అయితే ఉగ్రవాద పార్టీ అంటున్నరో... ఆ పార్టీ అధ్యక్షుడితో ప్రధానమంత్రి గంటపాటు సమావేశమయ్యారు. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి. ఎవరి సహకారం అక్కర లేకుండానే తెరాస 100 సీట్లు కైవసం చేసుకుంటుంది. -మంత్రి జగదీశ్​ రెడ్డి

ఇవీ చూడండి: బండి సంజయ్​ ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.