రాష్ట్ర ప్రభుత్వం వల్లే ఏపీలో వేల కోట్ల విలువైన రైల్వే పనులు నిలిచిపోయాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. లోక్సభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,636 కోట్లు ఇవ్వనందున రూ.10 వేల కోట్ల విలువైన రైల్వే పనులు నిలిచిపోయాయన్నారు. కడప - బెంగళూరు లైనులో 50 శాతం వాటా భరిస్తామని 2006లో రాష్ట్రం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయక పనులు ఆగాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం వల్లే 841 కి.మీ. 4 లైన్ల పనులు ఆగాయన్న గోయల్..రాష్ట్రం తన వాటా ఇచ్చాక తదుపరి పనులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు.
విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే ఏర్పాటు
విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నామన్న కేంద్రమంత్రి గోయల్ స్పష్టం చేశారు. తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన..దక్షిణ మధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే జోన్లు విభజించామన్నారు. వాల్తేర్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ వస్తుందని వెల్లడించారు. పాలన, నిర్వహణ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇదీచదవండి