రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధికి సంబంధించి డీపీఆర్లు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. పోర్టులు, ఏయిర్ పోర్టుల అభివృద్ధిపై ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఏపీఎస్ఎఫ్ఎల్, విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే రాయితీల వెసులుబాటుతోపాటు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశముంటుందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వంపై ఆధారపడకుండా పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధికి గల మార్గాలను అన్వేషించాలని మంత్రి గౌతమ్ రెడ్డి సూచించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగం, ప్రత్యామ్నాయ మార్గాలపై లోతుగా అధ్యయనం చేయాలని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: రాజకీయ రంగులు కుదరవ్..!: సుప్రీం