కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్ పర్సన్లు.. అధికారుల సహకారంతో నగర పాలక, పురపాలక సంఘాలను మరింత శక్తివంతం చేయాలని మంత్రి బొత్స సత్యనాారాయణ సూచించారు. ప్రభుత్వాన్ని, సంక్షేమాన్ని ప్రజల ముంగిట్లోకి చేర్చేలా స్థానిక పాలన అందించాలని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్ పర్సన్ల రాష్ట్ర స్థాయి కార్యశాలలో మంత్రి పాల్గొన్నారు.
వార్డు వాలంటీర్, వార్డు సచివాలయ వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకుంటూ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చెేరవేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. పరిపాలనలో సహనం కోల్పోవద్దని.. అధికారులు, ప్రజా ప్రతినిధులందరినీ సమన్వయపరుచుకోవాలని కోరారు. సమన్వయం కోసం కమిషనర్లు, ప్రజా ప్రతినిధులతో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు బొత్స తెలిపారు.
ఇదీ చదవండి: