ETV Bharat / city

ఆ ప్రచారాన్ని నమ్మెద్దు.. పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ: మంత్రి బొత్స - పది పరీక్షలపై మంత్రి బొత్స కామెంట్స్

పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకేజ్‌, కాపీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అక్రమాలకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు.

ఆ ప్రచారాన్ని నమ్మెద్దు.. పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ

author img

By

Published : Apr 30, 2022, 8:17 PM IST

పదో తరగతి పరీక్షా పత్రాలు లీక్ కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యార్ధులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయటంపైనే దృష్టి సారించాలని ఆయన సూచించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని.., స్వార్ధ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి అరెస్టు చేశామని మంత్రి తెలిపారు.

చిత్తూరులో ఓ ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది సహా మాల్ ప్రాక్టీసు చేసేందుకు ప్రయత్నించిన ఏడుగురిని, మరింకొందరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఆరు లక్షల మంది విద్యార్ధుల భవితకు సంబంధించిన అంశాలపై రాజకీయాలు చేయెద్దని మంత్రి హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని పట్టించుకోవద్దని విద్యార్ధులకు, తల్లితండ్రులకూ సూచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

"పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. అక్రమాలకు యత్నించిన వారిపై కఠిన చర్యలు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. ప్రశ్నపత్రాలు లీకేజ్‌, కాపీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని పట్టించుకోవద్దు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఏడుగురు సిబ్బందిపై కేసు నమోదు. నంద్యాలలో పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు." - బొత్స, విద్యాశాఖ మంత్రి

ఇదీ చదవండి: అందుకు నైతిక బాధ్యత వహించి మంత్రి బొత్స రాజీనామా చేయాలి: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.