Balineni Srinivas: వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరగనున్న తరుణంలో రాష్ట్రంలో ఎక్కడా కోతలు లేకుండా చూస్తామని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్‌ను కొనుగోలు చేసైనా... సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
నిధుల సమస్య లేకుండా ఆర్థికశాఖకు.. సీఎం తగిన సూచనలు చేశారని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మంజూరైన సబ్‌స్టేషన్లలో మూడింటి పనులు ప్రారంభమయ్యాని మంత్రి వెల్లడించారు. దేవినగర్ వద్ద విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో.. రూ.709 కోట్లు జమచేసిన సీఎం జగన్