Three People Died in the Same Family Due To House Collapse in Anantapur District : అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లిలో విషాదం నెలకొంది. ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మిద్దెపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రమాదం జరగిందని స్థానికులు తెలిపారు. మృతులు గంగన్న (43), శ్రీదేవి (38), సంధ్య (14)గా పోలీసులు గుర్తించారు. గత మూడు రోజుల నుంచి వర్షం కురుస్తుండడంతో పై కప్పు పూర్తిగా తడిసిపోయి ఒక్కసారిగా కుప్పకూడంతో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు ముగ్గురు నిద్రలోనే కన్నుమూశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై ఎమ్మెల్యే (MLA) అమిలినేని సురేంద్రబాబు స్పందించారు. మట్టి ఖర్చులకు మృతుల కుటుంబానికి 50 వేల రూపాయలు అందజేయాలని నాయకులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.