AP Tourism: ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయనున్నట్లు పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సచివాలాయంలో పర్యటక, సాంస్కృతిక శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను ఏప్రిల్ 9,10 తేదీల్లో విశాఖపట్నంలో సదస్సులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు సంబంధించి ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు నది పరివాహక ప్రాంతాల్లో బోటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. టూర్ ప్యాకేజీలను ప్రోత్సహించే విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. ప్యాకేజీలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులను ఆదేశాంచారు. అలాగే విశాఖ, తూర్పుగోదావరి, కడప, గుంటూరు జిల్లాల్లో టూరిజం ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి :
ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వం స్థాపిస్తాం: పవన్