ETV Bharat / city

ADIMULAPU SURESH: 'విద్యా సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్​ పూర్తి చేయండి' - విజయవాడ వార్తలు

ప్రభుత్వ-ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 100 శాతం సిబ్బందికి రెండు డోసుల టీకా వేయడం పూర్తిచేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్​లను ఏర్పాటు చేయాలని సూచించారు.

ADIMULAPU SURESH
విద్యా సిబ్బందికి వ్యాక్సినేషన్​ పూర్తి చేయండి
author img

By

Published : Jul 14, 2021, 11:32 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న టీచింగ్- నాన్ టీచింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(ADIMULAPU SURESH)​ ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియెట్, ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు సంబంధించి పూర్తిస్థాయి సిబ్బందికి టీకా అందించే ప్రకియను చేపట్టాల్సిందిగా జిల్లా జేసీలను, వైద్యాధికారులను సూచించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న 1,68,911 మంది ఉపాధ్యాయుల్లో.. 81,994 మందికి ఈ నెల 10 నాటికి తొలి విడత వ్యాక్సిన్ పూర్తైందని అధికారులు తెలిపారు. రెండో విడత టీకా​ను 57,056 మంది వేయించుకున్నట్టు మంత్రికి వివరించారు. మిగిలినవారికి కూడా రెండు డోసుల వ్యాక్సీన్ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం.. ప్రత్యేక డ్రైవ్​లు చేపట్టి 100 శాతం వ్యాక్సినేషన్(VACCINATION) పూర్తి చేయాలని కోరారు.

ఇదీచదవండి:

గదిలో బంధించి.. తొమ్మిది రోజులపాటు గ్యాంగ్​రేప్!

PERNI NANI: 'జల వివాదానికి గత సీఎం చంద్రబాబే కారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.