ETV Bharat / city

మెరికలకు మెలికలు.. ట్రిపుల్‌ఐటీల్లో విద్యార్థుల అవస్థలు - ట్రిపుల్‌ఐటీల్లో విద్యార్థుల అవస్థలు

పదోతరగతిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని మెరికల్లా తీర్చిదిద్దే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెలకొల్పి 14 ఏళ్లయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో శాశ్వత అధ్యాపకులు లేరు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి 665 వరకు ఖాళీలు ఉండగా.. ఒప్పంద అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. 2016లో ఒంగోలు, శ్రీకాకుళాల్లో వీటిని ప్రారంభించినా ఇంతవరకూ భవనాలే పూర్తి కాలేదు. వసతి, తరగతి గదులు లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులను ఇడుపులపాయ, నూజివీడుల్లో సర్దుబాటు చేస్తున్నారు. వేసవిలో తీవ్ర నీటి సమస్య ఏర్పడుతోంది. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు తప్పనిసరి కాగా.. కొంతమందికి ఇప్పటికీ ఇవ్వలేదు.

ట్రిపుల్‌ఐటీల్లో విద్యార్థుల అవస్థలు
ట్రిపుల్‌ఐటీల్లో విద్యార్థుల అవస్థలు
author img

By

Published : Jul 28, 2022, 4:31 AM IST

2016లో ఒంగోలు, శ్రీకాకుళాల్లో ట్రిపుల్‌ ఐటీలు ప్రారంభించినా ఇంతవరకూ భవనాలే పూర్తి కాలేదు. వసతి, తరగతి గదులు లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులను ఇడుపులపాయ, నూజివీడుల్లో సర్దుబాటు చేస్తున్నారు. వేసవిలో తీవ్ర నీటి సమస్య ఏర్పడుతోంది. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు తప్పనిసరి కాగా.. కొంతమందికి ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రకాశం జిల్లాలో ఇంతవరకూ భవన నిర్మాణ పనులే పూర్తి కాలేదు. 2017లో పామూరు మండలం దూబగుంట వద్ద అప్పటి ప్రభుత్వం నిర్మాణాలకు శంకుస్థాపన చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని కనిగిరి మండలం బల్లిపల్లికి మార్చారు. స్థానికంగా 240 ఎకరాలు సేకరించారు. భవనాల నిర్మాణాలు, వసతి కల్పనకు రూ.1200 కోట్ల అవుతుందని అంచనా వేశారు. తొలిదశలో రూ.200 కోట్లు కేటాయించాల్సి ఉన్నా ఒక్క పైసా రాలేదు. వసతి లేకపోవడంతో ఇక్కడ ఉండాల్సిన 6,000 మంది విద్యార్థుల్లో 2,000 మందిని ఇడుపులపాయలో ఉంచుతున్నారు. అద్దెకు తీసుకున్న రెండు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల భవనాల్లో మిగతా వారికి తరగతులు నిర్వహిస్తున్నారు. ఇడుపులపాయలో ఇప్పటికే ఉన్న వారికి వీరు తోడవడంతో ఒక్కచోటే 8,000 మంది అయ్యారు. వసతి సమస్యగా మారింది. ఇడుపులపాయలోని పాత భవనాల్లో ఉండలేమంటూ ఇటీవల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పాత క్యాంపస్‌లో మౌలిక వసతులు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా.. ఒక్కో గదిలో పరిమితికి మించి పిల్లలను ఉంచుతున్నారు. ఒంగోలు, ఇడుపులపాయకు చెందిన మొదటి ఏడాది విద్యార్థినులు వెయ్యి మందిని పాత క్యాంపస్‌లోనే ఉంచుతున్నారు.

రేకుల షెడ్లలో తరగతులు: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ భవనంలో 1,000 మంది, కొత్తగా నిర్మించిన ప్రాంగణంలో మరో 2,000 మంది విద్యార్థులు ఉంటున్నారు. మిగతా 3,000 మంది నూజివీడులో ఉంటున్నారు. వీరితో కలిపి నూజివీడులో విద్యార్థుల సంఖ్య 9,000కు చేరింది. వేసవిలో నీటిసమస్య తలెత్తుతోంది. గదుల్లో సామర్థ్యం కంటే ఎక్కువ మందిని ఉంచుతున్నారు. తాత్కాలికంగా నిర్మించిన రేకుల షెడ్లలో శ్రీకాకుళం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావడంతో భోజనశాలలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో మధ్యాహ్నం విడతలవారీగా భోజన విరామం ఇస్తున్నారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో మరో 4,000 మందికి వసతి కల్పించేందుకు చేపట్టిన పనులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో చాలారోజులు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇటీవల బిల్లులు చెల్లించడంతో తిరిగి ప్రారంభించారు.

నాణ్యతలేని భోజనం..: ఇడుపులపాయలో మొత్తం 12 మెస్‌లు ఉండగా.. మూడింటిలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. ఉడికీ ఉడకని ఉప్మా, నీళ్లపప్పు, గట్టి చపాతీ వంటివి పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు.

ల్యాప్‌టాప్‌లూ కొరతే..

  • ఇటీవల కొత్తగా 10,000 ల్యాప్‌టాప్‌లు కొన్నా అందరికీ సరిపోవడం లేదు.
    2019-20, 2020-21 బ్యాచ్‌ల వారికి ల్యాప్‌టాప్‌లు లేకుండానే వర్చువల్‌ విధానంలో బోధించారు.
  • ఇడుపులపాయలోని ఒంగోలు గతేడాది విద్యార్థుల్లో 200 మందికి ఇప్పటికీ ఇవ్వలేదు.
    శ్రీకాకుళంలో గతేడాది చేరినవారికి ల్యాప్‌టాప్‌లు ఇవ్వలేదు.
  • ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థులు కోర్సు పూర్తిచేసి వెళ్లిపోవటంతో వారి ల్యాప్‌ట్యాపులు వీరికి సర్దుబాటు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

రెండు పదవుల్లో ఇన్‌ఛార్జి వీసీ..: రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నాలుగు ట్రిపుల్‌ఐటీలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయానికి రెండున్నరేళ్లుగా శాశ్వత ఉపకులపతి(వీసీ)నే నియమించలేదు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఇన్‌ఛార్జి వీసీగా కొనసాగుతున్నారు. ఒక కీలక బాధ్యత ఉన్న ఆయన.. వీసీగా ఎలా దృష్టిసారించగలరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ వీసీనే నియమించలేదంటే ట్రిపుల్‌ఐటీలపై ఉన్న దృష్టి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వీసీ నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చి, వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలి.

ట్రిపుల్‌ ఐటీలు అన్నింటికీ కలిపి మొత్తం 717 అధ్యాపక పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం రెగ్యులర్‌ వాళ్లు 52 మందే ఉన్నారు. మిగతా వారంతా ఒప్పంద అధ్యాపకులే. వేతనాలు పెంచకపోవడంతో వారిలో కొందరు వెళ్లిపోయారు. ఆ ఖాళీలను భర్తీ చేయలేదు. సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇవ్వలేదు. దీంతో ఆర్జీయూకేటీకి ఇంతవరకూ న్యాక్‌ గుర్తింపు లేదు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.