ETV Bharat / city

తెలంగాణలో పాల కొరత... మిల్క్ పౌడర్ ధరకు రెక్కలు! - wings for milk powder prices in telangana

తెలంగాణలో పాలకు కొరత ఏర్పడింది. ఈసారి శీతాకాలంలోనే రాష్ట్రంలోని డెయిరీలకు డిమాండ్‌ మేరకు పాలు రాక ఇతర రాష్ట్రాల నుంచి కొంటున్నాయి. రానున్న వేసవి దృష్ట్యా పాల పొడినీ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో పాలపొడి ధరలకు రెక్కలు వచ్చాయి

తెలంగాణలో పాల కొరత... మిల్క్ పౌడర్ ధరకు రెక్కలు!

author img

By

Published : Jan 25, 2021, 10:05 AM IST

తెలంగాణలో పాలకు కొరత ఏర్పడింది. సాధారణంగా పాడి గేదెలు, ఆవులు శీతాకాలంలో పాలు అధికంగా ఇస్తాయి. వేసవిలో (మార్చి నుంచి ఆగస్టు వరకూ) ఉత్పత్తి తగ్గి పాల కొరత ఏర్పడుతుంది. ఈసారి శీతాకాలంలోనే రాష్ట్రంలోని డెయిరీలకు డిమాండ్‌ మేరకు పాలు రాక ఇతర రాష్ట్రాల నుంచి కొంటున్నాయి.

పాలపొడికి రెక్కలు...

రానున్న వేసవి దృష్ట్యా పాల పొడినీ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో పాలపొడి ధరలకు రెక్కలు వచ్చాయి. డెయిరీ ఇచ్చే ధరకన్నా రాష్ట్ర ప్రభుత్వం లీటరుకు అదనంగా రూ. 4 ఇస్తున్నా గ్రామాల్లో పాలు పెద్దగా దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి...

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య’(విజయ డెయిరీ) రోజూ 3.50 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. మూడు లక్షల లీటర్లలోపే సేకరించగలుగుతోంది. దీంతో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజూ 50 వేల లీటర్ల గేదె పాలను కొంటోంది. కొన్ని ప్రైవేటు డెయిరీలు సైతం కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి నిత్యం పాలను కొంటున్నాయి.

సాధారణంగా శీతాకాలంలో అధికంగా పాలు వచ్చినప్పుడు వాటిని పొడిగా మార్చి డెయిరీలు నిల్వ చేస్తుంటాయి. వేసవిలో కొరత ఏర్పడినప్పుడు ఆ పొడిని పాలుగా మార్చి విక్రయిస్తుంటాయి. ప్రస్తుతం పాలకే కొరత ఏర్పడిన నేపథ్యంలో పాలపొడిని తయారు చేయలేక పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. కిలో పాల పొడికి రూ.230 చొప్పున చెల్లించి విజయ డెయిరీ 20 టన్నులు కొని నిల్వ పెట్టింది.

రానున్న రోజుల్లో మరింత...

రానున్న 3, 4 నెలల్లో కొరత కారణంగా పాలపొడికి గిరాకీ, ధర మరింత పెరుగుతాయని ఇతర డెయిరీలూ ముందస్తు కొనుగోళ్లు ప్రారంభించాయి. గత ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాణిజ్య అమ్మకాలు లేక పాలు మిగిలిపోయాయి. గత మార్చి నుంచి జులై వరకూ పాలపొడి తయారీ అధికంగా జరిగింది. మూడు నెలల క్రితం వరకూ కిలో పాలపొడి ధర రూ.150 నుంచి 200 వరకు ఉండేది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పాలపొడి కిలో ధర రూ.380 నుంచి 440 వరకూ ఉంది.

మరో రూ. 18 కోట్లు...

కర్ణాటక, ఏపీ నుంచి గేదె పాలు కొంటున్నామని విజయ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.శ్రీనివాసరావు ‘చెప్పారు. పాడి రైతుల ఆదాయం పెంచేందుకు లీటరుకు అదనంగా రూ.4 చొప్పున ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల కింద రూ.25 కోట్లను తాజాగా చెల్లించినట్లు తెలిపారు. మరో రూ.18 కోట్లు త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

ఖర్చులు పెరుగుతున్నా ధర పెంచడం లేదు

పాడి పశువుల నిర్వహణకు ఆర్థికభారం బాగా పెరిగింది. రోజుకు 10 లీటర్లు ఇచ్చే ఆవు ధర రూ.లక్ష వరకూ ఉంది. దాణా, కూలీ రేట్లు పెరిగాయి. ఇక్కడ కూలీలు దొరకడం లేదు. బిహార్‌ నుంచి రప్పిస్తున్నాం. ఒక్కో బిహారీకి నెలకు రూ.15 వేలు ఇచ్చి, ఉండటానికి ఇల్లు చూపితేనే పనిచేస్తున్నారు. ఆవు పాలకు ఐదేళ్లుగా రూ.30లోపే డెయిరీలు చెల్లిస్తున్నాయి. రైతులకు గిట్టుబాటు కాక పాడిపశువులను వదిలించుకుని పల్లెల్లో సైతం ప్యాకెట్‌ పాలు కొంటున్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలి.

- బాల్‌రెడ్డి, పాడి రైతు, ఎదుల్లగూడెం, యాదాద్రి జిల్లా

ఇదీ చూడండి: సుప్రీంలో 'స్థానిక సమరం'.. నేడే విచారణ.. మారిన ధర్మాసనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.