కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పొలం దున్నుతుండగా అతను పిడుగుపాటుకు గురయ్యాడు.
విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామనగర్‌లో పిడుగు పడి షహీనా అనే పాపకి స్వల్ప గాయాలయ్యాయి. పాపను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గన్నవరం మండలం తేంపల్లి పంట పొలాల్లో పిడుగుపడి తాడిచెట్టు దగ్ధం అయ్యింది.
విజయనగరం జిల్లాలో 5 ఎద్దులు మృతి..
విజయనగరం జిల్లా కురుపాం మండలం జరడ గ్రామం పరిధిలోని బుధవారం తేలికపాటి వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు 5 దుక్కి ఎద్దులు మృతిచెందాయి. వీటితోపాటు 14 పశువులకు గాయాలు అయినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
విశాఖ జిల్లాలో 12 దుక్కిటెద్దులు..
విశాఖ జిల్లా అరకులోయ నియోజకవర్గంలో పిడుగులతో తీవ్ర నష్టం వాటిళ్లింది. అరకులోయ మండలం మాదాల పంచాయతీ మేదేరసొల గ్రామంలో పిడుగుపాటుకు గురై భీమన్న అనే గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వైద్య సేవల కోసం అరకులోయ ఆసుపత్రికి తరలించారు. దుంబ్రిగుడ మండలం శసీలంగొంది గ్రామంలో పిడుగుపడి 12 దుక్కిటెద్దులతో పాటు ఆరు మేకలు మృతిచెందాయి.
ఇదీ చదవండి: jagananna house: వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి రేపు శ్రీకారం