ఆంధ్రప్రదేశ్లోనే అట్రాసిటీ కేసులు ఎక్కువగా ఉన్నాయని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు అన్నారు. విజయవాడ కస్తూరిబాయిపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో తనిఖీలు నిర్వహించారు. వసతిగృహంలో సౌకర్యాలు, ఇతర అంశాలపై విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు.
ప్రభుత్వాలు విద్యార్ధుల ఉన్నతికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని... మంచి ఫలితాలు రావాలని ఆకాంక్షించారు. ఒక్కో గదిలో 30 నుంచి 44 మంది ఉండాల్సి వస్తోందని విద్యార్ధినులు వివరించారు... దీనిపై స్పందించి... కలెక్టరుతో మాట్లాడి మౌలిక వసతుల మెరుగుకు కృషి చేస్తానని కె.రాములు తెలిపారు. దళితులపై పెరుగుతోన్న వేధింపులు, అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు
ఇదీ చదవండి