ETV Bharat / city

సీఎం జగన్​ కలిసేందుకు చిరు సన్నాహాలు.. పరిశ్రమ పెద్దలతో చర్చ

ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్రి పేర్ని నాని మెగాస్టార్​ చిరంజీవిని ఆహ్వానించారు. కరోనా సంక్షోభసమయంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు చిరు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం తన నివాసంలో పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.

సీఎం జగన్​ కలిసేందుకు చిరు సన్నాహాలు
సీఎం జగన్​ కలిసేందుకు చిరు సన్నాహాలు
author img

By

Published : Aug 16, 2021, 4:24 PM IST

క‌రోనా వల్ల సినీప‌రిశ్ర‌మకు తలెత్తిన స‌మస్య‌ల‌పైనా.. అలాగే ఆంధ్రప్ర‌దేశ్​లో టిక్కెట్ల రేట్ల స‌మ‌స్య‌ల‌పైనా చ‌ర్చించేందుకు ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపారు. మంత్రి పేర్ని నాని స్వయంగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో సీఎంకి విన్న‌వించాల్సిన అన్ని విష‌యాల‌పైనా కూలంకుశంగా చ‌ర్చించి వెళ్లాల‌న్న ఉద్దేశంతో ఇండ‌స్ట్రీలోని పెద్దలతో హైద‌రాబాద్​లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశం జ‌రిగింది.

చిరును కలిసిన సినీ దిగ్గజాలు..

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్​ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్. రామారావు, దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వీ. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ భోగవల్లి, బాబీ, యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ ఇలా.. నిర్మాత‌ల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల ఏపీలో వ‌చ్చిన జీవోలో ఉన్న‌వాటిపై చ‌ర్చించారు. సీఎంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అవసరమైన మార్గాలేమిటి..? అన్న‌దానిపై చ‌ర్చించారు. అన్నిటినీ త్వరగా ప‌రిష్క‌రించాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్. చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌ల‌పైనా సీఎంతో భేటీలో చ‌ర్చించ‌నున్నారు.

చిన్న సినిమాలు, టిక్కెట్ల ధరలపై చర్చ..

ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్ల రేట్ల‌పై చ‌ర్చించ‌నున్నారు. గ్రామ పంచాయితీ, న‌గ‌ర పంచాయితీ, కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఏం చేయాలి..? చిన్న సినిమాల మనుగడకోసం ఐదో షో ప్రదర్శన విషయమై చర్చించారు. ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిపై సానుకూల వాతావరణం వచ్చేలా.. అవన్నీ ఓ కొలిక్కి వచ్చేలా అందరూ కలిసి సమావేశంలో చర్చించారు. అలాగే పరిశ్రమలో అన్ని విభాగాల్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారంపై సమాలోచన చేశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో ఉంచకూడదని ప్రభుత్వం నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.