వచ్చే నెల మొదటివారంలో భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కొనసాగుతోందని వెల్లడించారు. మొదటి సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని... పార్టీ బలోపేతం కోసం అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. శాసనసభలో ప్రజలగొంతు వినిపించాలని జనసేన పార్టీ ఎమ్మెల్యేకు సూచించినట్టు మనోహర్ తెలిపారు.
ఇదీ చదవండి... రక్తదానమే వారసత్వం.. ఆ కుటుంబం అందరికీ ఆదర్శం